ETV Bharat / city

ఉపాధ్యాయ బదిలీలకు ముందే.. సర్దుబాటు - teachers rationalization process news

ఉపాధ్యాయ బదిలీల నిర్వహణకు ముందే రేషనలైజేషన్​ పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. జిల్లా విద్యాశాఖ నుంచి టీచర్ల పోస్టులు, పని సర్దుబాటు వివరాలతో కూడిన సమాచారం పంపాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. స్వల్ప సంఖ్యలో ప్రవేశాలు ఉన్న పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లను సర్దుబాటులో భాగంగా ఏమూలకు వేస్తారోనన్న ఉత్కంఠ వారిలో ఉంది.

ఉపాధ్యాయ బదిలీలకు ముందే.. సర్దుబాటు
ఉపాధ్యాయ బదిలీలకు ముందే.. సర్దుబాటు
author img

By

Published : Jun 22, 2020, 10:08 AM IST

ఉపాధ్యాయుల బదిలీల నిర్వహణకు ముందే రేషనలైజేషన్‌ (సర్దుబాటు) ప్రక్రియను ఓ కొలిక్కి తేవాలనే యోచనలో పాఠశాల విద్యాశాఖ ఉంది. దీనికి సంబంధించిన చర్యలను వేగవంతం చేసింది. జిల్లా విద్యాశాఖ నుంచి టీచర్ల పోస్టులు, పని సర్దుబాటు వివరాలతో కూడిన సమాచారం పంపాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ నుంచి డివిజన్‌ ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు పాఠశాలల వారీగా శాంక్షన్డ్‌ పోస్టులు.. ప్రస్తుతం పని చేస్తున్న వారి వివరాలు, పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌ వివరాలను తక్షణమే అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఈ పరిణామం ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. ఇప్పటి వరకు స్వల్ప సంఖ్యలో ప్రవేశాలు ఉన్న పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లను సర్దుబాటులో భాగంగా ఏమూలకు వేస్తారోనన్న ఉత్కంఠ వారిలో నెలకొంది.

జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3279 ఉన్నాయి. ప్రతి పాఠశాల నుంచి సంబంధిత నమూనాలో వివరాలను పంపాలని స్పష్టం చేసింది. మూడేళ్ల క్రితం పని సర్దుబాటు కోసం రేషనలైజేషన్‌ నిర్వహణకు గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ ఆచరణకు వచ్చేసరికి అది అమలు చేయలేదు. దీని వల్ల చాలా పాఠశాలల్లో పిల్లల సంఖ్య కన్నా ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్నారని, మరికొన్నిచోట్ల పిల్లలకు సరిపడా టీచర్లు లేక ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటిని అధిగమించడానికి తక్షణం రేషనలైజేషన్‌ చేపట్టడమే ఏకైక పరిష్కార మార్గమని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. దీంతో జిల్లాలో ఈ దిశగా కసరత్తు జరుగుతోంది.

డైస్‌తో సంబంధం లేకుండా...

ఏ పాఠశాలలో ఎంత మంది పిల్లలు, ఎందరు టీచర్లు ఉన్నారనేది ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఆన్‌లైన్‌లో సమాచారం అందుబాటులో ఉంది. ఇది అంత పక్కాగా ఉండకపోవచ్చని, దీనిలో కొంత బోగస్‌ హాజరు ఉండొచ్చన్న అనుమానంతో ఫిజికల్‌గా ఎంఈవో, హెచ్‌ఎం, డీవైఈఓల నుంచి వేర్వేరుగా ఈ వివరాలు సేకరించాలని నిర్ణయించింది. దీని వల్ల ఎవరికి వారు కచ్చితమైన సమాచారం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అనేక పాఠశాలల్లో పిల్లల ప్రవేశాలు వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉన్నాయి. కానీ ఉపాధ్యాయులు మాత్రం ఇద్దరు, ముగ్గురికి తక్కువ కాకుండా ఉన్నారు. మరికొన్ని చోట్ల పిల్లలకు సరిపడా టీచర్లు లేక ఉపాధ్యాయుల కొరత ఎదుర్కొంటున్నాయి. ఈ అసమానతలను నివారించి ప్రతి ఉపాధ్యాయుడికి పనిభారం(వర్క్‌లోడ్‌) చూపించటానికి రేషనలైజేషన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. గతంలోనే సుమారు 550 పాఠశాలల్లో పిల్లల కన్నా టీచర్లు అధికంగా ఉన్నారని గుర్తించారు. ఈ క్రమంలోనే పిల్లల ప్రవేశాలు తక్కువ ఉన్న పాఠశాలలను సమీపంలో పిల్లలు ఎక్కువ ఉన్న బడుల్లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికి ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఇదీ చూడండి..

పత్తి పంటకు దూరంగా.. మిరప సాగుకు దగ్గరగా..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.