ఏప్రిల్ నుంచి సచివాలయాల ద్వారా పట్టణ ప్రాంతాల్లో 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు.. గుంటూరు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. నగరంలోని భారత్ పేట, కుందలరోడ్డులోని వార్డు సచివాలయాలను.. కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ ప్రశాంతి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు సందర్శించారు.
భారత్ పేటలోని 140వ వార్డు సచివాలయం, కమ్యూనిటీ సెంటరు, కుందల రోడ్డులోని 117వ వార్డు సచివాలయం వద్ద వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటును వారు పరిశీలించారు. వైద్యారోగ్యశాఖ నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్, వెయిటింగ్ రూమ్, వాక్సిన్ ఇచ్చే రూమ్, అబ్జర్వేషన్ రూములను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ఇదీ చదవండి: