ETV Bharat / city

గుంటూరు జిల్లాలో వ్యాపార వేళలు కుదింపు.. మిర్చి యార్డుకు సెలవులు

author img

By

Published : Apr 28, 2021, 8:18 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున వ్యాపార కార్యకలాపాల సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం మూడు వరకు కుదిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. మిర్చి యార్డుకు కూడాా ముందుగానే వేసవి సెలవులు ప్రకటించారు.

మిర్చి యార్డుకు సెలవులు
గుంటూరు జిల్లాలో వ్యాపార వేళలు కుదింపు

గుంటూరు జిల్లాలో కొవిడ్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా.. వ్యాపార వేళలను మరింతగా తగ్గించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో గుంటూరు మూడో స్థానంలో ఉన్నందున ఈనెల 22వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటల వరకే వర్తక, వాణిజ్య కార్యకలాపాలను ముగిస్తున్నారు. అయినప్పటికీ కేసులు తగ్గకపోవడంతో.. వ్యాపార నిర్వహణ సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 వరకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు తెలిపారు. ఇందుకు వ్యాపారులందరూ సహకరించాలని ఆయన కోరారు.

ముందుగానే గుంటూరు మిర్చి యార్డుకు సెలవులు..

గుంటూరు మిర్చి యార్డుకు మే 3 నుంచి జూన్ 6 వరకు సెలవులు ప్రకటించారు. వేసవి తాపం అధికంగా ఉండటంతో పాటు.. కరోనా కేసులు ఎక్కువ కావటంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా మే నెల రెండో వారం తర్వాత యార్డుకు వేసవి సెలవులు ఇవ్వాల్సి ఉండగా.. వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, కూలీలు యార్డు ఛైర్మన్, అధికారుల్ని విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఛైర్మన్ ఏసురత్నం, కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు శీతల గోదాముల్లో విక్రయాలు నిర్వహించుకునేందుకు అనుమతించారు.

ఇవీ చదవండి:

టీకా రిజిస్ట్రేషన్ల వెల్లువ.. కొవిన్‌ పోర్టల్‌ క్రాష్‌

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.