ETV Bharat / city

ఆడపిల్లగా పుట్టింది... మగరాయునిగా బతికింది..!

ఆడజన్మఎత్తినా... జీవితాంతం మగాడిలానే జీవిస్తోంది. తల్లిదండ్రులకు తుదిదాకా తోడు నిలిచేందుకు... అక్కచెళ్లెళ్లకు పెళ్లి చేసేందుకు.. వివాహ బంధాన్నే వద్దనుకుంది. సమాజం సంధించిన విమర్శలు... బంధువుల సూటిపోటి మాటలకు... చేతలతోనే సమాధానమిచ్చింది. పంచె, చొక్కా, కండువా తప్ప... జీవితంలో చీర కట్టిందే లేదు. స్త్రీవాదానికి కొత్త నిర్వచనమిచ్చేలా జీవిస్తున్న పశ్చిమ గోదావరికి చెందిన వృద్ధురాలిపై ప్రత్యేక కథనం.

mister savithri
మిస్టర్ సావిత్రి
author img

By

Published : Oct 19, 2020, 4:27 PM IST

Updated : Oct 19, 2020, 5:30 PM IST

70 ఏళ్ల వయసులోనూ ఎవరిమీదా ఆధారపడకుండా స్వయంగా పనులు చేసుకుంటూ.... 'అతడు'లా కనిపిస్తున్న 'ఆమె' పేరు సావిత్రి. వేషధారణ, ఆమె పనులు చేసే విధానం చూసి ఎవరైనా పురుషుడే అనుకుంటారు. ఆడపిల్లగా పుట్టి... మగరాయునిలా ఆమె మారటానికి పేదరికమే కారణం. పశ్చిమగోదావరిజిల్లా ఉంగటూరు మండలం నీలాద్రిపురానికి చెందిన సావిత్రి .. ఆరుగురు సంతానంలో నాల్గో కుమార్తె. అందరూ ఆడపిల్లలే పుట్టడంతో... సావిత్రి తల్లి... ఆమెను మగపిల్లానిలా తయారు చేసి ముచ్చట తీర్చుకునేది. అలా చిన్నప్పుడే ఇంటికి మగదిక్కులా మారిన సావిత్రి... జీవితాంతం ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు పూర్తిగా మగరాయునిలా మారింది.

కుటుంబం కోసం వివాహ బంధాన్ని వదిలి...

14వ ఏటనే చొక్కా, నిక్కరు వేసిన సావిత్రి... వయసులో ఉన్న ఆడపిల్ల అటువంటి బట్టలు వేయటమేంటని బంధువులు హేళన చేసినా పట్టించుకోలేదు. కుటుంబాన్ని పోషించాలంటే అన్ని పనులూ చేయాలని నిర్ణయించుకున్న ఆమె...అన్ని పనులూ మగాళ్లతో సమానంగా చేసేది. ఆ కూలి డబ్బులతోనే కుటుంబాన్నిపోషించింది. తల్లిదండ్రుల మరణం తరువాత... ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిలు ఆమె చేసింది. పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోయినా... సావిత్రి ఏ మాత్రం మారలేదు. కుటుంబం కోసం వివాహ బంధాన్నీ వదిలేసింది. తన సోదరి మూగది కావటం వల్ల ... భర్త వదిలేశాడు. అప్పటి నుంచీ ఆమెను సావిత్రే పోషించింది. ఇటీవలే ఆ సోదరి మరణించింది.

మిస్టర్ సావిత్రి

కుటుంబానికి జీవితాన్నే ధారపోసిన ఆమె... తిరిగి ఏమీ కోరుకోలేదు. ఇటీవలి వర్షాలకు ఇల్లు కూలిపోతే... స్వయంగా పాక వేసుకుంది. వయసుబాగా పైబడటంతో ఇతర పనులు చేసుకునేందుకు ఆమె ఇబ్బంది పడుతోందని.. గ్రామస్థులు తెలిపారు. ఆడపిల్లగా పుట్టినందుకుగానీ... మగరాయునిలా బతికినందుకుగానీ.... తను ఎప్పుడూ బాధపడలేదని సావిత్రి గర్వంగా చెప్పారు..

ఇదీ చదవండి:
ఆరేళ్లలో 90 మంది అతివల బలి

Last Updated : Oct 19, 2020, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.