వైఎస్ఆర్ బీమా పథకం నిరుపేదలకు రక్షణగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్ఆర్ బీమా కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకం ప్రాధాన్యతను సంతరించుకుందని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తింపచేయడం ప్రత్యేకమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: