తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిల్లీ పర్యటన వెనుక మతలబేంటని.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దిల్లీలో వ్యవస్థల్ని ప్రభావితం చేసేందుకు వచ్చారా అని విజయసాయి అడిగారు. పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థిస్తున్నారా చెప్పాలన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు లేవన్న విజయసాయి..చంద్రబాబు సంగతి తెలిసే అమిత్షా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. దిల్లీలో చంద్రబాబును కలిసేందుకు ఎవరూ సమయం ఇవ్వట్లేదని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: Pawan kalyan tweet: ఏపీ మాదక ద్రవ్యాల కేంద్రంగా మారింది: పవన్ కల్యాణ్