ETV Bharat / city

'ఏజీ లేఖ సారాంశం అదే...జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు' - సీఎం జగన్ లెటెస్ట్ న్యూస్

సుప్రీంకోర్టు సీజేకు సీఎం జగన్ రాసిన లేఖలో అభ్యంతరకర అంశాలు ఉన్నాయని ఏజీ కె.కె వేణుగోపాల్ అభిప్రాయపడ్డారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఏజీతో సహా న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

Yanamala
Yanamala
author img

By

Published : Nov 2, 2020, 9:48 PM IST

అటార్నీ జనరల్(ఏజీ) కె.కె వేణుగోపాల్ న్యాయవాది అశ్వని కుమార్ ఉపాధ్యాయకు రాసిన లేఖ.. జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్నది స్పష్టం చేసిందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్ రాసిన లేఖ కోర్టు ధిక్కారనేనని ఏజీతో సహా న్యాయ నిపుణులు, ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు.

దేశచరిత్రలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై 31 కేసుల ప్రధాన నిందితుడు తప్పుడు ఆరోపణలు చేయటం చూడలేదన్న యనమల...ప్రతి ఒక్కరికీ ఇదే అలవాటు కాకుండా ఉండాలంటే జగన్ లేఖను కోర్టు ధిక్కరణగా పరిగణించాలని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాలంటే వెంటనే అప్రమత్తమై లేఖ రాసినవాళ్లతో పాటు విడుదల చేసినవారిపైనా చర్యలు చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి : సీజేఐకి సీఎం లేఖలో అంశాలు అభ్యంతరకరం: ఏజీ వేణుగోపాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.