ETV Bharat / city

ఓటు పోటెత్తాలి... ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి - AP Political news

ప్రజాస్వామ్యం బాగుపడాలంటే... అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల్లో పాల్గొనాలి. తమ భవిష్యత్తును నిర్ణయించే ప్రతినిధులను ఎన్నుకోవడం ద్వారా సమస్య పరిష్కారానికి మార్గం సుగమమవుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటింగ్​ శాతమే పౌరుల భాగస్వామ్యానికి కొలమానం. స్థానిక ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో బాధ్యతాయుత పౌరుడిగా పాలుపంచుకోవాలి. ఓటు వేయడాన్ని గర్వించదగ్గ అంశంగా భావించాలి. ఎన్నికల్లో ప్రజలు, ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని ఓటింగ్‌ శాతం పెంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి. అప్పుడే భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుకు సాధికారత.

Voting Decrease In Villages
Voting Decrease In Villages
author img

By

Published : Feb 5, 2021, 10:37 PM IST

ప్రజాస్వామ్యం పురోగతి వైపు పయనించాలంటే... అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలి. తమతమ ప్రతినిధులను ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజాసమస్యలకు పరిష్కారాలు లభించి సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటింగ్‌ శాతమే పౌరుల భాగస్వామ్యానికి కొలమానం. ప్రజాస్వామ్య దేశాల్లో ఓటింగ్‌ శాతం తగ్గడం 1945 నుంచి ప్రారంభమై... 1980 మధ్యకాలానికి బాగా దిగజారింది. భారత్‌ విషయానికొస్తే పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే గ్రామీణ, స్థానిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం అధికంగా ఉంటుందని.. పట్టణ ప్రజలకంటే పల్లె ప్రజలు చురుగ్గా పాల్గొంటారని జాతీయ ఎన్నికల అధ్యయన సమాచారం తెలియజేస్తోంది.

వ్యక్తిగత కారణాలే ప్రధానం..

పట్టణాలు, మహానగరాలతో పోలిస్తే... పల్లెల్లో ఓటింగ్‌ శాతం ఎక్కువే. అయినా క్రమంగా ఓటింగ్ శాతం తగ్గడం ఆందోళన కలిగించే విషయాలు. వ్యవస్థ, వ్యక్తిగత అంశాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. ఓటర్ల జాబితా సవరణను సకాలంలో చేపట్టకపోవడం, జాబితాలో అవకతవకలు, రిజర్వేషన్లు, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు మొదలైనవి సంస్థాగత కారణాలు. ఓటర్ల నిరాసక్తత, బాధ్యతారాహిత్యం, ఓటింగ్​పై అపోహలు వంటివి వ్యక్తిగత కారణాలు. ఓటింగ్‌ శాతం తక్కువగా ఉండటానికి సంస్థాగత కారణాల కంటే, వ్యక్తిగత కారణాలే ప్రధానం. ఈ పరిస్థితిని చక్కదిద్దినప్పుడే పల్లెల్లో ప్రజాస్వామ్యం వికసిస్తుంది.

అప్పుడే ప్రజాస్వామ్యం విరాజిల్లుతుంది..

ప్రజాస్వామ్యం ఒక సంక్లిష్ట భావన. పరిపక్వత కలిగిన పౌరులు, బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం విరాజిల్లుతుంది. ఒకే ఎన్నికలో ప్రాంతాలవారీగా ఓటింగ్‌ నమోదులో వ్యత్యాసాలు ఉంటాయి. స్థానిక పరిస్థితులు, సమస్యలు, వ్యక్తుల ప్రవర్తన ఓటింగ్‌ శాతంపై ప్రభావం చూపుతాయి. గ్రామాల్లో ఓటింగ్‌ శాతం తగ్గడానికి మరొక ముఖ్యకారణం టెక్నాలజీ ప్రభావం. సంక్షేమ భావనకు తిలోదకాలు ఇచ్చి ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల ద్వారా పౌర సేవలు అందించే వ్యవస్థ ఆవిర్భవించడంతో ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య దూరం పెరిగింది. ప్రభుత్వాల ఏర్పాటు, ఎన్నికలు అనేవి కొన్ని వర్గాలకే పరిమితమైనవిగా భావించి వాటిపట్ల వ్యతిరేకతను పెంచుకుంటున్నారు మధ్యతరగతి ప్రజలు.

ప్రోత్సాహకాలు ప్రకటించాలి..

పటిష్ఠమైన ప్రభుత్వం ఉన్నప్పుడే పౌరులు శాంతియుత జీవనం పొందుతారు. ఎక్కువ శాతం పౌరుల భాగస్వామ్యంతో మాత్రమే పటిష్ఠ ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఎలక్షన్ల సమయంలో ఓటర్ల చైతన్య కార్యక్రమాలు చేపట్టడంలో మీడియాది ముఖ్య భూమిక. ఈ కార్యక్రమాల ప్రభావం ఓటింగ్‌ శాతం పెంచడంలో ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. చైతన్య కార్యక్రమాలతో పాటు 80 శాతానికి మించి ఓటింగ్‌ చేసిన ప్రాంతాలకు కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలి. అప్పుడు గ్రామాల్లో పరిస్థితి మారే అవకాశాలుంటాయి.

ఇదీ చదవండీ... మూడో విడత పంచాయతీ ఎన్నికలు.. పూర్తి సమాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.