సర్వేపల్లి కెనాల్, కృష్ణపట్నం కెనాల్, జాఫర్ కెనాల్ రిటర్నింగ్ వాల్ నిర్మాణంపై నెల్లూరు జిల్లాకు చెందిన మురళిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. 110 కోట్ల టెండర్‌ను 99 కోట్లరూపాయలు చూపించారని పిటిషనర్ తరుపు న్యాయవాది వేణుగోపాలరావు వాదనలు వినిపించారు. 100 కోట్లు దాటితే జ్యూడిషియల్ కమిటీ అప్రూవల్ ఉండాలని న్యాయవాది వేణుగోపాలరావు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
జ్యూడిషియల్ కమిటీ అప్రూవల్ తప్పించుకునేందుకు టెండర్ 99 కోట్లుగా చూపించారని.. ఇది చట్టవిరుద్దమని పిటిషనర్ న్యాయవాది అన్నారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణాన్ని మంత్రి ప్రభావితం చేస్తున్నారని పిటిషనర్ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.టెండర్ నోటిఫికేషన్ ఫైల్ చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు