Revised estimates of Polavaram project : పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందంతో సమావేశమైంది. ఈ భేటీలో ప్రాజెక్టు అంచనాలపై ఒక అవగాహనకు వచ్చామని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో వివిధ పెండింగ్ సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక, జల్‌శక్తి, ఉక్కు, విమానయాన, మైనింగ్‌తో పాటు పలు ఇతర శాఖల కార్యదర్శులు, పీఎంవో అధికారుల బృందంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సోమవారం నార్త్‌బ్లాక్‌లో సమావేశమైంది.
పోలవరం ప్రాజెక్టు విషయంలో పునరావాసం సహా అన్ని అంశాలపై రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు సాగాయన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను ఇటీవల ప్రధాని మోదీకి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కలిసి వివరించారని ఆయన తెలిపారు. ఈ భేటీ అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి వివిధ శాఖల కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేశారన్నారు. వారితో కూడా తాము చర్చలు జరిపామని విజయసాయిరెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి.. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించామన్నారు. సమావేశం సానుకూలంగా సాగిందని, వివిధ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించామని విజయసాయిరెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి : hc on prc 'పీఆర్సీ వ్యాజ్యం సీజే ముందుంచండి'
విజయసాయిరెడ్డి నేతృత్వం వహించిన ఈ బృందంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఆదిత్యనాథ్ దాస్, జవహర్‌రెడ్డి తదితరులున్నారు. సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 20 మంది ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారని, దీనికి కొనసాగింపుగా సంబంధిత అధికారులతో రాష్ట్ర అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి, ఈ అంశాలను ముందుకు తీసుకెళతారని ఆయన వివరించారు. త్వరలోనే మంచి సమాచారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెవెన్యూ లోటుపైనా చర్చించామని తెలిపారు. కేంద్ర బడ్జెట్ సమయంలో బిజీగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండున్నర గంటల సమయం ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి ప్రధాన మంత్రి ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ సమావేశం నిదర్శనమని విజయ సాయిరెడ్డి అభిప్రాయపడ్డారు
ఇదీ చదవండి : Gudivada Casino Issue :గుడివాడ క్యాసినోపై జాతీయ సంస్థలకు ఫిర్యాదు: చంద్రబాబు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!