తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంటే రాష్ట్ర మంత్రివర్గమంతా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనే మకాం వేసిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వారిని ఆయా జిల్లాల నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఇతర పార్టీల నేతలను తిరుపతి పార్లమెంట్ పరిధి నుంచి పంపించిన పోలీసులు.. అధికార పార్టీ నేతల్ని ఎందుకు ఉంచారని వర్ల రామయ్య విమర్శించారు. మంత్రులంతా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనే ఉన్నారనే సమాచారం డీజీపీకి ఉందా ? లేదా? అని వర్ల ప్రశ్నించారు. చంద్రగిరి, పుంగనూరు, పీలేరు, పలమనేరు నియోజకవర్గాల నుంచి స్థానికేతరులను తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి తరలించారని వర్ల ఆరోపించారు.
ఇదీ చదవండి: