ETV Bharat / city

అడిగినంత కుదరదు ఇచ్చినంత తీసుకోండి.. పోలవరంపై కేంద్రం - Union finance department

Finance Department పోలవరం పనుల్లో కేంద్రం చెప్పేదానికి, రాష్ట్ర ప్రభుత్వం చేసే పనికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. కొన్ని పనులకు కేంద్రం నిర్ణయించిన అంచనాల మొత్తం ఎప్పుడు దాటిపోవడంతో, బిల్లులు చెల్లించేందుకు అంగీకరించడం లేదు. తాజాగా ప్రాజెక్ట్‌ హెడ్‌వర్క్స్‌లో చేసిన పనులకు జలవనరులశాఖ 102.2 కోట్లు బిల్లు పంపగా.. అంత మొత్తానికి అర్హత లేదని ప్రాజెక్టు అథారిటీ తేల్చింది. కేవలం 7.94 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇప్పటివరకూ కేంద్ర ఆర్థికశాఖ అంగీకారం ప్రకారం ఇంతకు మించి బిల్లు చెల్లించే అవకాశం లేదని తెలిసింది. భూసేకరణ, పునరావాసానికి ప్రస్తుతం సిఫార్సు చేసిన బిల్లు చెల్లిస్తే.. రానున్న రోజుల్లో పెట్టే కొత్త బిల్లులు మంజూరు కావడం కష్టమే అంటున్నారు నిపుణులు.

: పోలవరం ప్రాజెక్ట్‌ బిల్లులు చెల్లించేందుకు కేంద్రం కొర్రీలు వేస్తోంది. 2013-14 ధరల ప్రకారమే
అడిగినంత కుదరదు ఇచ్చినంత తీసుకొండి.. పోలవరంపై కేంద్రం
author img

By

Published : Sep 7, 2022, 8:40 AM IST

‍ Polavaram bills as per 2013 14 rates: పోలవరం ప్రాజెక్ట్‌ బిల్లులు చెల్లించేందుకు కేంద్రం కొర్రీలు వేస్తోంది. 2013-14 ధరల ప్రకారమే చెల్లింపులకు అంగీకరించినందున.. ఆ మేరకే ఇస్తామని స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లులను సిఫార్సు చేయని P.P.A.. సీలింగ్ పేరిట ఎక్కడికక్కడ కోతలు విధిస్తోంది. పోలవరం పనుల్లో కేంద్రం చెప్పేదానికి, రాష్ట్ర ప్రభుత్వం చేసే పనికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. కొన్ని పనులకు కేంద్రం నిర్ణయించిన అంచనాల మొత్తం ఎప్పుడు దాటిపోవడంతో, బిల్లులు చెల్లించేందుకు అంగీకరించడం లేదు.

తాజాగా ప్రాజెక్ట్‌ హెడ్‌వర్క్స్‌లో చేసిన పనులకు జలవనరులశాఖ 102.2 కోట్లు బిల్లు పంపగా.... అంత మొత్తానికి అర్హత లేదని ప్రాజెక్టు అథారిటీ తేల్చింది. కేవలం 7.94 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇప్పటివరకూ కేంద్ర ఆర్థికశాఖ అంగీకారం ప్రకారం ఇంతకు మించి బిల్లు చెల్లించే అవకాశం లేదని తెలిసింది. భూసేకరణ, పునరావాసానికి ప్రస్తుతం సిఫార్సు చేసిన బిల్లు చెల్లిస్తే... రానున్న రోజుల్లో పెట్టే కొత్త బిల్లులు మంజూరు కావడం కష్టమే. పోలవరం ప్రాజెక్టులో ఏ పనికి ఎంత మొత్తమన్నది కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. దీని ప్రకారం కొన్ని పనులకు నిర్ణయించిన మొత్తం దాటిపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పెట్టినా P.P.A సిఫార్సు చేయడం లేదు. ఏ పనికి ఎంత ఇవ్వాలన్న సీలింగ్‌తో గత మే 19 వరకు వచ్చిన బిల్లుల్లో.. 2వేల 266 కోట్ల రూపాయల బిల్లులను P.P.A. సిఫార్సు చేయలేదు.

ఈ నెల 2న కేంద్ర జలసంఘానికి P.P.A. పంపిన నివేదికలో.. రాష్ట్రం కోరినట్లుగా మొత్తం బిల్లు సిఫార్సు చేయకపోవడానికి కారణాలను వివరించింది. మే 19 తర్వాత 325.239 కోట్ల బిల్లుల కోసం ప్రతిపాదనలు వచ్చాయని.. అందులో హెడ్‌వర్క్స్‌ బిల్లు 102.277 కోట్లు, పునరావాసానికి 169.833 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. మిగిలిన మొత్తం ఎస్టాబ్లిష్‌మెంట్‌కు సంబంధించినది. కేంద్ర జలశక్తిశాఖ ఇచ్చిన సమాచారం మేరకు.. 2013-14 ధరల ప్రకారం చెల్లించడానికే ఆర్థికశాఖ అంగీకరించింది.

2021 జూన్‌ 10న కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ఏ పనికి ఎంత చెల్లించాలన్నది నిర్ణయించారు. అందుకే గతంలో వచ్చిన బిల్లుల్లో 2 వేల 266.925 కోట్లను తిరస్కరించినట్లు నివేదికలో తెలిపారు. ప్రస్తుతం వచ్చిన బిల్లులో పునరావాసానికి 169.833 కోట్లకు రాగా... సీలింగ్‌ ప్రకారం 167.765 కోట్లకు సిఫార్సు చేస్తున్నామని P.P.A తెలిపింది. గృహాలు- మౌలిక వసతులకు 1.999 కోట్లు, ఎస్టాబ్లిష్‌మెంట్‌ కింద వచ్చిన 3.191 కోట్లు యథాతథంగా సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది. అయితే పనులకు సంబంధించి 102.277 కోట్లకు వచ్చిన బిల్లులో కేవలం 7.94 కోట్లకే సిఫార్సు చేస్తున్నామంటూ.... తిరస్కరించడానికి కారణాలను P.P.A. వివరించింది.

2013-14 ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని చెల్లించడానికి అంగీకరించినందున.... ఇక కేంద్రం చెల్లించాల్సింది 2వేల 622 కోట్లేనని P.P.A లేఖలో తెలిపింది. అంగీకరించిన ప్రకారం మొత్తం వ్యయం 20 వేల398 కోట్లు కాగా... 2014 ఏప్రిల్‌కు ముందు 4వేల 730 కోట్లు ఖర్చు చేశారు. కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఖర్చు చేయాల్సింది 15 వేల 667 కోట్లు ఉండగా... ఇప్పటివరకు 13వేల 45 కోట్లు చెల్లించింది. అందువల్ల కేంద్రం నుంచి ఇక రావాల్సింది 2వేల 622 కోట్లు మాత్రమేనని PPA స్పష్టంచేసింది.

అడిగినంత కుదరదు ఇచ్చినంత తీసుకొండి.. పోలవరంపై కేంద్రం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.