తెలంగాణలో 20 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ ఆ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
- డీఎస్పీ రఘుచందర్‌ను స్టేషన్ ఘన్పూర్ ఏసీపీగా బదిలీ చేశారు. అనిశా డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి మెట్పల్లి ఎస్డీపీఓగా.. మెట్పల్లి ఎస్డీపీఓ గౌస్ బాబా.. హైదరాబాద్ చీఫ్ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. గోదావరి ఖని ఏసీపీ ఉమేందర్‌ను.. హైదరాబాద్ చీఫ్ ఆఫీస్‌కు అటాచ్ చేశారు.
- నిఘా విభాగం డీఎస్పీ జీ బస్వా రెడ్డి ఖమ్మం రూరల్ ఏసీపీగా, అక్కడ ఉన్న ఎస్ వెంకట్ రెడ్డిని హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌కు బదిలీ చేశారు.
- వెయింటింగ్‌లో ఉన్న బీవీ సత్యనారాయణను వికారాబాద్ ఎస్డీపీవోగా, అక్కడ ఉన్న ఏ సంజీవరావు హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు.
- వెయిటింగ్‌లో ఉన్న జీ కృష్ణను జనగాం ఏసీపీగా నియమించగా, అక్కడ ఉన్న ఎస్ వినోద్ కుమార్‌ను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
- వెయిటింగ్‌లో ఉన్న ఏ మహేశ్‌ను బెల్లంపల్లి ఏసీపీగా నియమించగా, అక్కడ ఉన్న ఎంఏ రహమాన్‌ను చీఫ్ ఆఫీస్‌కు బదిలీ చేశారు.
- మహబూబ్‌నగర్‌లో వెయిటింగ్‌లో ఉన్న బీ కృష్ణను మహబూబ్‌నగర్ ఎస్డీపీవోగా నియమించగా, అక్కడ ఉన్న జీ శ్రీధర్‌ను హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌కు బదిలీ చేస్తూ స్థానచలనం కల్పించారు.
- వరంగల్ డీఎస్పీ ఎన్ సుధీర్‌ను హైదరాబాద్‌లోని గోపాలపురం ఏసీపీగా నియమించగా, అక్కడ ఉన్న పీ వెంకట రమణను చీఫ్ ఆఫీస్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
- సైబరాబాద్ కమిషనరేట్‌లో పోస్టింగ్ కోసం వేచిఉన్న బీ గంగాధర్‌ను రాజేంద్రనగర్ ఏసీపీగా నియమించగా, అక్కడ ఉన్న ఆర్ సంజయ్ కుమార్‌ను చీఫ్ ఆఫీస్‌కు బదిలీ చేశారు.
ఇదీ చదవండి : Marijuana caught: ట్యాంకర్లో తరలిస్తున్న గంజాయి పట్టివేత..