ETV Bharat / city

తెలంగాణ: రాజాసింగ్​ రోడ్​ షోలో భాజపా - తెరాస పోటాపోటీ నినాదాలు - trs activists blocked mla raja singh road show

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కేపీహెచ్​బీ కాలనీలో ప్రారంభమైన భాజపా తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్​షో.. బాలాజీనగర్​ డివిజన్​ వద్దకు చేరుకోగానే.. అదే దారిలో వచ్చిన తెరాస నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. భాజపా నేతలు వెనక్కి వెళ్లిపోవాలని తెరాస కార్యకర్తలు నినాదాలు చేశారు.

trs-activists-raised-slogans
trs-activists-raised-slogans
author img

By

Published : Nov 27, 2020, 8:19 PM IST

బల్దియా ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు, ప్రచార హోరుతో హైదరాబాద్​ నగరం దద్దరిల్లుతోంది. కేపీహెచ్​బీ నుంచి భాజపా తెలంగాణ నేత రాజాసింగ్​ రోడ్ షో నిర్వహించారు. బాలాజీనగర్​ డివిజన్​ వద్దకు రాజాసింగ్ బృందం చేరుకోగానే.. అదే సమయంలో అటునుంచి వెళ్తున్న తెరాస నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.

భాజపా నాయకులు వెనక్కి వెళ్లిపోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఒక్కసారిగా పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ క్రమంలో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. తెరాస, భాజపా కార్యకర్తలను ఆయా పార్టీల నాయకులు సముదాయించగా గొడవ సద్దుమణిగింది. ప్రచార సమయంలో వెనక్కి వెళ్లిపోవాలని తెరాస కార్యకర్తలు నినాదాలు చేయడం సరికాదని పలువురు భాజపా నాయకులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి :

ప్రసవానికి 10 నిమిషాల ముందు గర్భిణీ నృత్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.