ETV Bharat / city

REVANTH REDDY ARREST: ఉద్రిక్తతల నడుమ రేవంత్ రెడ్డి అరెస్టు.. - ఏపీ తాజా వార్తలు

Revanth Reddy Arrest : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అతికష్టం మీద వారిని తప్పించి.. రేవంత్​ను అక్కడి నుంచి తరలించారు.

REVANTH REDDY ARREST
REVANTH REDDY ARREST
author img

By

Published : Dec 27, 2021, 4:27 PM IST

Revanth Reddy Arrest : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం తలపెట్టిన రేవంత్‌.. అక్కడకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకొచ్చారు. దీంతో.. రేవంత్‌ను పోలీసులు అరెస్టు చేసి అంబర్ పేట పీఎస్​కు తరలించారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు ఇవాళ ఉదయం గృహనిర్బంధం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. రైతు సమస్యలపై సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో ఇవాళ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటానని రేవంత్‌ రెడ్డి నిన్న వెల్లడించారు.

ఈ నేపథ్యంలో.. ఉదయాన్నే పోలీసులు ఆయన ఇంటి వద్ద మోహరించారు. ఆయన నివాసం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఎర్రవల్లికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకొచ్చిన రేవంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమాచారం తెలిసిన పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పీసీసీ చీఫ్ ఇంటికి వెళ్లారు.

ఇదీ చదవండి: Akhanda team at Yadadri : దేశం గర్వించే స్థాయిలో.. యాదాద్రి పునర్నిర్మాణం: బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.