ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 pm - ఏపీ వార్తలు

.

ప్రధాన వార్తలు @ 9 pm
ప్రధాన వార్తలు @ 9 pm
author img

By

Published : Jun 9, 2021, 9:02 PM IST

  • సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!

కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా వైఎస్సార్‌ బీమా (YSR Bima)లో రాష్ట్ర ప్రభుత్వం(ap govt) మార్పులు చేసింది. క్లెయిమ్​ల పరిష్కారంలో చిక్కులకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే సహాయం చేస్తుందని సీఎం జగన్ (cm jagan) ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • జూడాల చర్చలు సఫలం.. సమ్మె విరమణ

రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్‌ వైద్యుల (Junior Doctors) చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. జూడాలతో మంత్రి ఆళ్ల నాని(minister alla nani) , ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చర్చలు జరిపారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని జూడాలు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రేపు దిల్లీకి సీఎం జగన్.. పర్యటన ఖరారు
    ముఖ్యమంత్రి జగన్‌ రేపు దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి షెకావత్‌ సమయం కోరారు సీఎం జగన్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • జూన్ చివరి నాటికి ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్: సింఘాల్

రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య రెండు కోట్లను దాటిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు ఆ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్(anil kumar singhal) వెల్లడించారు. మరోవైపు జూన్ చివరి నాటికి దాదాపు 20 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు కూడా వ్యాక్సినేషన్(vaccination) వేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Covaxin X Covishield: 'ఆ నివేదికలో అనేక లోపాలు'

కొవాగ్జిన్‌ టీకాను కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లను పోలుస్తూ ఓ జర్నల్​లో ప్రచురించిన కథనంపై భారత్‌ బయోటెక్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. కొవాగ్జిన్‌ కంటే కొవిషీల్డ్‌ వ్యాక్సినే అధికంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందంటూ వచ్చిన కథనాన్ని ఖండించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Covid: మూడో దశ సన్నద్ధతపై మోదీ సమీక్ష

కరోనా మూడో దశ సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గురువారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ భేటీకి అమిత్ షా సహా కీలక నేతలు హాజరుకానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • నిఖిల్​తో పెళ్లైంది.. కానీ చెల్లదు: ఎంపీ నుస్రత్​

నిఖిల్​ జైన్​తో సంబంధం గురించి కొనసాగుతున్న వివాదంపై మౌనం వీడారు తృణమూల్ కాంగ్రెస్​ నేత నుస్రత్​ జహాన్​. నిఖిల్​తో తనకు టర్కిష్​ చట్టం ప్రకారం వివాహం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనపై పలు ఆరోపణలు చేశారు నుస్రత్​. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మహిళకు ఒకే కాన్పులో 10 మంది పిల్లలు

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది ఓ మహిళ. ఏడు నెలల ఏడు రోజుల గర్భవతి అయిన ఆమెకు సిజేరియన్ నిర్వహించి ప్రసవం చేశారు వైద్యులు. ఇంత మంది పుడతారని తాము ఊహించలేదని భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • హత్య కేసులో కొత్తం కోణం.. అమ్మాయే కారణమా?

రెజ్లర్ హత్య కేసుకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు పోలీసుల విచారణలో వెల్లడయ్యాయి. ఇంటి అద్దె విషయంలో వచ్చిన వాగ్వాదాలు హత్యకు కారణం కాదని తెలుస్తోంది. సోను గర్ల్​ఫ్రెండ్​ వల్లే గొడవ మొదలైనట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఈ 'అవెంజర్స్​' స్టార్..​ షారుక్​కు ఫ్యాన్​!

హాలీవుడ్​​ నటుడు టామ్​ హిడిల్​స్టన్(Tom Hiddleston).. బాలీవుడ్​ స్టార్ హీరో​ షారుక్​ ఖాన్​పై(Sharukh Khan) తనకున్న ప్రేమను తెలియజేశాడు. ఇండియా, బాలీవుడ్​ అనగానే తనకు టక్కున బాద్​షానే గుర్తుకు వస్తాడని చెప్పాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.