ముఖ్యమంత్రి జగన్‌తో గురువారం సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. సినీ పరిశ్రమ అంశాలతో పాటు టిక్కెట్ల ధరలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
సీఎంతో పేర్ని నాని భేటీ..
Minister Perni Nani Meet cm ys jagan: ముఖ్యమంత్రి జగన్‌తో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని.. మంగళవారం భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై సీఎంతో చర్చించారు. టికెట్ల అంశంపై ప్రభుత్వ కమిటీ చేసిన అధ్యయనంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలతో పాటు.. సినిమా థియేటర్ల యజమానుల సమస్య పరిష్కారంపై కూడా మాట్లాడినట్లు సమాచారం. నేడు మరోసారి సీఎం జగన్‌తో పేర్ని నాని భేటీ కానున్నారు. గురువారం సిని ప్రముఖులతో జరిగే భేటీలో చర్చించే అంశాలపై ఈ సందర్భంగా జగన్‌తో మాట్లాడనున్నారు.
ఇటీవల ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయింది. ధరలు తక్కువగా ఉండటంతో నష్టపోతున్నామని పలువురు సినిమా హీరోలు, నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ధరల విషయంపై కమిటీ అధ్యయనం పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టికెట్ ధరలను ఏ మేరకు పెంచాలన్న దానిపైనా, ఇటు ప్రజలకు, అటు సినీ పరిశ్రమకు ఇబ్బంది లేకుండా టికెట్ రేట్లు ఎంత ఉండాలన్న దానిపైనా కమిటీ సభ్యులు నివేదికను రూపొందించారు. ఈ నివేదికలోని అంశాలను మంత్రి పేర్ని నాని, సీఎం జగన్‌కు వివరించారు. అంతేకాదు, థియేటర్‌లలో మౌలిక సదుపాయాలు, క్యాంటీన్‌లో ఆహార పదార్ధాల ధరలపైనా కమిటీ చేసిన అధ్యయనాన్ని మంత్రి పేర్ని నాని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈనెల 10న టాలీవుడ్ పెద్దలు.. సీఎం జగన్ ను కలవనున్నారు. ముఖ్యంగా సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు, థియేటర్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు సహా, సినిమా రంగానికి ప్రభుత్వపరంగా అందాల్సిన సహకారంపైనా చర్చించనున్నారు.
ఇదీ చదవండి
CM Jagan slams Opposition Parties: 'ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రతిపక్షాలకు పండుగే'