ETV Bharat / city

నేటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా

నేటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తాజాగా 20వ తేదీ(సోమవారం)కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

today ap cabient meet postponed
today ap cabient meet postponed
author img

By

Published : Jan 18, 2020, 3:33 AM IST

రాష్ట్ర కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షత మంత్రివర్గ భేటీ జరగాల్సింది. తాజాగా 20వ తేదీ(సోమవారం)కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తొలుత ఈనెల 20న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ భావించినప్పటికీ.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఈ రోజు జరగాల్సిన భేటీ కూడా వాయిదా పడింది. ఈనెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే కేబినెట్‌ భేటీ నిర్వహించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది. కేబినెట్‌ భేటీకి ముందే హైపవర్‌ కమిటీ కూడా తమ నివేదికను సీఎం జగన్‌కు అందజేసే అవకాశముంది.ఆ నివేదికపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. మూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో చర్చ జరగుతున్న నేపథ్యంలో కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని అసెంబ్లీ సమావేశాల్లో దానిపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

నేటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా

ఇదీ చదవండి : అమరావతిలో 144 సెక్షన్‌ అమలుపై హైకోర్టు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.