Special trains to sabarimala: శబరిమలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సికింద్రాబాద్- కొల్లామ్, కొల్లామ్- సికింద్రాబాద్, కాచిగూడ-కొల్లామ్, కొల్లామ్- కాచిగూడ, నాందేడ్- కొల్లామ్, తిరుపతి- కొల్లామ్, తిరుపతి- నాందేడ్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని ద.మ. రైల్వే తెలిపింది. అయ్యప్ప భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
కార్తికమాసం వచ్చిందంటే అయ్యప్ప భక్తుల యాత్రలు మొదలవుతాయి. తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో అయ్యప్ప స్వామి మాలధారులు శబరిమలకు పయణమవుతుంటారు. వారి సౌకర్యార్థం.. దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.
ఇదీ చదవండి: AP Govt vs Empolyees : ఉద్యోగుల "సింహగర్జన"కు.. సర్కారు సమాధానమేంటి?