ETV Bharat / city

'మీ నిర్ణయం సరైనదైతే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రండి' - tdp leader kala venkatarao comments on cm jagan

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ రాజధానిపై మాట మార్చి.. ఇప్పుడు ప్రజలకు ముఖం చాటేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. ఎన్నికల ముందు చెప్పిన రాజకీయ విలువలు ఇప్పుడు కనిపించడం లేదా.. అని కళా ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు అసెంబ్లీ రద్దు చేసి.. ఎన్నికలకు సిద్ధమవ్వాలని సవాల్​ విసిరారు.

'మీ నిర్ణయం సరైనదైతే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రండి'

author img

By

Published : Aug 6, 2020, 12:21 AM IST

tdp leader kala venkatarao
కళా వెంకట్రావు పత్రికా ప్రకటన

మూడు రాజధానులపై వైకాపా తీసుకున్న నిర్ణయం సరైనదైతే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ సవాల్‌ విసిరారు. అభివృద్ధి కోసమే పాలనా వికేంద్రీకరణ అంటున్న సీఎం జగన్‌ ప్రజాభిప్రాయం తీసుకుందామంటే ఎందుకు వెనకాడుతున్నారో చెప్పాలన్నారు. జగన్​ అమరావతిపై మాట తప్పి ప్రజల్ని మోసం చేసినందుకు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.

రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతిచ్చి ఇప్పుడు విశాఖలో కబ్జా చేసిన భూముల కోసం మూడు రాజధానులు అంటున్నారని కళా ధ్వజమెత్తారు. ఇవేనా ఆయన చెప్పిన రాజకీయ విలువలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతృత్వ వైఖరితో తీసుకున్న నిర్ణయంపై ప్రజా వ్యతిరేకతను తట్టుకేలేకే.. సీఎం ప్రజలకు ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా అధినేత చంద్రబాబు సవాల్​ను స్వీకరించి.. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్​ చేశారు. ఒకవేళ ప్రజలు మళ్లీ వైకాపాకు అధికారం ఇస్తే తాము మాట్లాడమని.. లేని పక్షంలో న్యాయపోరాటం కొనసాగుతుందని కళా వెంకట్రావు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి..

కాశీబుగ్గ సీఐ ఘటనపై పోలీసుశాఖ తరపున క్షమాపణలు: ఎస్పీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.