పంచాయితీల అభివృద్ధిపై అవగాహన లేకనే వైకాపా నేతలు.. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను ఆరోపిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.
"తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రామాభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారు. అసోంలో భాజపా, పశ్చిమ బంగాల్లో కాంగ్రెస్ పార్టీలు కూడా పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేకే మేనిఫెస్టోను వైకాపా నేతలు తప్పుపడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి తన పేరుని పెద్దరికం లేని రెడ్డిగా మార్చుకోవాలి. గతంలో ఏకగ్రీవాల ముసుగులో పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఆయన సాగించిన రక్తపాతాన్ని ప్రజలు మర్చిపోలేదు. అధికారం ఉందనే అహంకారంతోనే ఏకగ్రీవాల జపం చేస్తున్నారు. 20 నెలలుగా పల్లెలకు తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి, మంత్రులకు లేదు" -తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ఇదీ చదవండీ.. చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయి?..యువతకు ఓటుహక్కు పిటిషన్పై హైకోర్టు