సంపద దోచుకునేందుకు.. సంపద సృష్టించే అమరావతి బ్రాండ్‌కి సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు లక్ష్యమైతే.. అన్ని ప్రాంతాల్లో సహజవనరులు దోచుకోవాలన్న కాంక్ష జగన్‌దని విమర్శించారు. అమరావతిని అభివృద్ధి చేస్తే 13 జిల్లాల్లోని మారుమూల యువతకూ ఉద్యోగాలు వస్తాయని.. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తే 10 మందికైనా ఉపాధి దొరుకుతుందా అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ అమరావతికి ఖర్చు పెట్టిన రూ.10 వేల కోట్ల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఆందోళన చేస్తున్న రైతులను పట్టించుకోని మంత్రులు... వారిని అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతి రైతుల మరణాలను.. ప్రభుత్వ హత్యలేనని తేల్చిచెప్పారు. అన్నంపెట్టిన రైతులను రోడ్డునపడేసిన సీఎంగా.. జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: వెదర్ అప్డేట్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం