మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్ నైజమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్న మేనిఫెస్టో హామీల్లోనే మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి సంక్షోభాలను సృష్టిస్తున్నారని.. సన్నబియ్యం హామీపై అసెంబ్లీ సాక్షిగా మాట మార్చారని.. వాహన మిత్రను యజమానులకు పరిమితం చేసి డ్రైవర్లను మోసగించారని దుయ్యబట్టారు. అన్న క్యాంటీన్లను నిలిపివేసి పేదల పొట్ట కొట్టారని కళా మండిపడ్డారు.
ఇదీ చదవండి : ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్