ETV Bharat / city

కొత్త ఆర్థిక ఏడాదిలో తెలంగాణకు పెరిగిన పన్ను ఆదాయం ! - Tax revenue in Telangana

Tax revenue in Telangana: కొత్త ఆర్థిక ఏడాదిలో మొదటి రెండు నెలల్లో తెలంగాణ ప్రభుత్వానికి పన్నుఆదాయంలో దాదాపు 15శాతం సమకూరింది. ఏప్రిల్‌తో పోలిస్తే పన్నుఆదాయం మే నెలలో స్వల్పంగా పెరిగింది. మొత్తం రెవెన్యూ ఆదాయం పదిశాతాన్ని అధిగమించింది. పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు మాత్రం స్వల్పంగానే ఉన్నాయి.

Tax revenue in Telangana
Tax revenue in Telangana
author img

By

Published : Jun 29, 2022, 4:51 PM IST

కొత్త ఆర్థిక సంవత్సరంలో పెరిగిన పన్నుఆదాయం

Tax revenue: తెలంగాణలో కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుఆదాయం బాగానే ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్​కు ప్రభుత్వం అందించిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయ అంచనా రూ.లక్షా 26వేల కోట్లు కాగా.. మే నెలాఖరు వరకు రూ.18,751 కోట్ల ఖజానాకు సమకూరాయి. ఇది ప్రతిపాదిత పన్నుఆదాయంలో 14.81శాతంగా ఉంది.

ఏప్రిల్ నెలలో ప్రభుత్వానికి పన్ను ఆదాయం రూ.9291 కోట్లు రాగా.. మే నెలలో స్వల్పంగా పెరిగి రూ.9459 కోట్లు పన్నుల ద్వారా సమకూరాయి. జీఎస్టీ ద్వారా రూ.6223కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.4872కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2586 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.2599 కోట్ల రూపాయలు సమకూరాయి. ఇతర పన్నుల రూపంలో మరో రూ.1274 కోట్లు రాగా.. కేంద్ర పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి కేవలం రూ.1195 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి.

గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి కేవలం రూ.291 కోట్లు మాత్రమే సమకూరాయి. పన్నేతర ఆదాయం రూ.913 కోట్లు సమకూరింది. రిజర్వ్ బ్యాంకు నుంచి బాండ్ల వేలం ద్వారా తీసుకునే బహిరంగ మార్కెట్ రుణాలకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో మే నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రుణం తీసుకోలేదు. జూన్‌లో మాత్రం ఇప్పటికే రూ.4000కోట్ల రుణం తీసుకోగా.. మరో రూ.3000 కోట్లను అప్పు ద్వారా సమకూర్చుకోనుంది.

రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.18,409 కోట్లు ఖర్చు చేసింది. బడ్జెట్‌లో పొందుపరచిన మొత్తం వ్యయంలో ఇది 8.41శాతం. ఇందులో రెవెన్యూ ఖర్చు రూ.17,684కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.725కోట్లు. రెవెన్యూవ్యయంలో ఉద్యోగాల జీతాలకు రూ.6078 కోట్లు ఖర్చు చేసింది. వడ్డీల చెల్లింపులు రూ.3162 కోట్లు ఖర్చు చేయగా.. పెన్షన్ల కోసం రూ.3017 కోట్లు వ్యయం చేసింది. రాయతీలపై రూ.1368 కోట్లు ఖర్చు చేశారు. రంగాల వారీగా చూస్తే సాధారణ రంగంపై రూ.8143 కోట్లు, సామాజిక రంగంపై రూ.6543 కోట్లు, ఆర్థిక రంగంపై రూ.3722కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

నిరుడు ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన పన్నుఆదాయం రూ.13198కోట్లు రాగా... ప్రస్తుతం ఆ రెండు నెలల్లో రూ.18751 కోట్ల ఆదాయం పన్నుల ద్వారా వచ్చింది. రెవెన్యూవ్యయం గతేడాదితో పోలిస్తే మొదటి రెండు నెలల్లో దాదాపు రూ.2000 కోట్ల వరకు తగ్గింది. వడ్డీ చెల్లింపులు రూ.300 కోట్ల మేర పెరిగాయి. మూలధనవ్యయం భారీగా తగ్గింది. 2021-22 ఏప్రిల్, మే నెలల్లో మూలధన వ్యయం కింద రూ.2580కోట్లు ఖర్చు చేయగా.. 2022-23 ఏప్రిల్, మే నెలల్లో కేవలం రూ.614 కోట్లు మాత్రమే వ్యయం అయింది.

ఇదీ చదవండి: రుణ యాప్‌ల ఆగడాలు.. ఉసురు తీసుకుంటున్న బాధితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.