ETV Bharat / city

కృష్ణా నది ఒడ్డే అవాసం..ఒక్క పూటే భోజనం - problems of nagayathippa villgers news

దశాబ్దాలుగా కృష్ణా నదే వారికి అవాసం... పని దొరికితే పూట గడుస్తుంది....లేకపోతే పస్తులు ఉండాల్సిందే. నది ఒడ్డున గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న వారు... చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తారు. నదికి వరదలు వచ్చాయంటే ఉన్న గుడిసెలు కొట్టుకుపోయి కట్టుబట్టలతో కరకట్టపైకి చేరుకుంటారు. శ్రమనే నమ్ముకున్న కాలం వెళ్లదీస్తున్న వారికి భారీ వరదలు శాపంగా మారాయి. కనీసం తినటానికి తిండి దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

krishna
krishna
author img

By

Published : Oct 21, 2020, 10:47 PM IST

Updated : Oct 21, 2020, 11:04 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం, నాగాయతిప్ప సరిహద్దులోని కృష్ణానదిలో గుడిసెలు వేసుకుని 8 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. చిన్నాపెద్దా కలిపి సుమారు 50 మంది ఉన్నారు. గత రెండు నెలలుగా కృష్ణానదిలో వరదలు రావడంతో నదిలో వేటాడే అవకాశం లేకపోవడమే కాదు.. ఉన్న గుడిసెలూ కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కరకట్టపైకి చేరుకున్నారు. వరద బాధితులకు పునరావాసం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా... వారికి ఎలాంటి సహాయం అందలేదు. ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో యాచిస్తూ... ఆకలి తీర్చుకుంటున్నారు. వారి దీనస్థితిని చూసిన పలువురు రైతులు సాయం చేస్తున్నారు.

ధ్రువపత్రాలు ఉన్నా...

తరతరాలుగా కృష్ణానదిలో ఉండే ఈ నిరుపేద కుటుంబాలకు రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటం లేదు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు సాయం చేసేందుకు ముందుకు వస్తే తప్ప ఆకలి తీరని పరిస్థితి. ఏవరైనా సాయం చేసినా ఒక్క పూటకే సరిపడుతుంది. కేజీ బియ్యం వస్తే తలో ముద్ద మాత్రమే తిని ఆకలి తీర్చుకుంటున్నారు.

సాయం అందించండి...

వరద బాధితుల పునరావాసం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలను విడుదల చేసినా తమ లాంటి అభాగ్యులకు అందడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎవరిన్ని సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితి తమదని చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న 500 రూపాయలను అందేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. తమకు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కృష్ణా నది ఒడ్డే అవాసం..ఒక్క పూటే భోజనం

ఇదీ చదవండి

తిరుచానూరులో విషాదం: చెరువులోకి దూకి సోదరులు ఆత్మహత్య

Last Updated : Oct 21, 2020, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.