ETV Bharat / city

విదేశీ రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు

యునైటెడ్ కింగ్ డమ్ లో బయటపడిన కొవిడ్ 19 కొత్త వేరియంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రకటన జారీచేసింది. సార్స్ కొవ్ 2 కొత్త వేరియంట్ కూడా ప్రయాణికుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో విమాన ప్రయాణికులు రాకపోకలపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ప్రత్యేకించి యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించినటువంటి వివరాలను సేకరించాల్సి ఉండగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

State Government orders imposing restrictions on flights travels from foreign countries
విదేశీ రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
author img

By

Published : Dec 22, 2020, 10:44 PM IST

Updated : Dec 23, 2020, 2:02 AM IST

విదేశీ రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాల మేరకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. బ్రిటన్‌లో బయటపడిన కొత్త వైరస్‌ దృష్ట్యా ముందుజాగ్రత్తగా ఆంక్షలు విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

అక్కడి నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా

బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఇటలీ నుంచి వచ్చేవారిపై నిఘా ఉంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. విమానాశ్రయాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై దృష్టి సారించాలని సూచించింది. నెల్లూరు, కృష్ణా, గుంటూరు, అనంతపురం కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చేవారు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండేలా చూడాలని ఆదేశించింది.

దీంతో పాటు ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరి హోమ్ క్వారంటైన్ చేసేందుకు వీలుగా సూచనలు జారీ చేయాలని తెలిపింది. అలాగే క్షేత్రస్థాయి సిబ్బంది కూడా దృష్టి పెట్టాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు కూడా పంపించారు.

ఇదీ చదవండి:

వచ్చే విద్యా సంవత్సరంలో ఏడో తరగతికి ఆంగ్లమాధ్యమం: సీఎం

Last Updated : Dec 23, 2020, 2:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.