కరోనా అనుమానాస్పద మృతదేహాల అంత్య క్రియల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సూచనలు చేర్చి ఆదేశాలను జారీ చేసింది. చనిపోయిన వ్యక్తికి కోవిడ్ పరీక్ష నిర్వహించిన అనంతరం నెగటివ్ వస్తే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి శ్రీకాంత్ తెలిపారు. చనిపోయిన వ్యక్తి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే మృతదేహాన్ని ఖననం చేసేందుకు నిబంధనలు పాటించాలన్నారు. ఆరోగ్య కార్యకర్త పీపీఈ కిట్ ధరించి మృతదేహాన్ని వార్డు నుంచి తొలగించాలని.. లీక్ ప్రూఫ్ ప్లాస్టిక్ బాడీ బ్యాగ్‌ల్లో ఉంచాలని తెలిపారు.
కుటుంబ సభ్యులు ఇచ్చిన వస్త్రాలను మృతదేహానికి చుట్టాలని చెప్పారు. మృతదేహాలకు శవ పరీక్షలు చేయొద్దని వైద్య సిబ్బందికి సూచించారు. మృతదేహాన్ని బ్యాగ్‌లో ఉంచి బంధువులకు అప్పగించాలని తెలిపారు. మృతుని బంధువులు మృతదేహానికి స్నానం చేయించడం, ముట్టుకోవడంలాంటి చర్యలు చేయొద్దన్నారు. శ్మశానవాటికలో 20 మందికి మించి బంధువులు ఉండకూడదని స్పష్టం చేశారు. మరణించిన వారి కొవిడ్ నిర్ధారణ ఫలితాలు త్వరగా వచ్చే విధంగా నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇదీ చదవండి: