పదవీకాలం ముగియక ముందే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) పదవి నుంచి తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ... నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. పిటిషనర్, ప్రభుత్వం తరఫు వాదనలు విన్న న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈనెల 16లోపు కౌంటర్ వేయాలని ఆదేశించింది. అయితే ఆ గడువు ఇవాళ్టితో ముగుస్తున్నా... ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ క్రమంలో మరో రెండ్రోజుల సమయం ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టును కోరారు.
కౌంటర్ దాఖలుకు సమయం కోరిన ప్రభుత్వం - ఏపీ ఎన్నికల కమిషనర్ వార్తలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ వ్యవహారంపై ప్రమాణపత్రం దాఖలుకు హైకోర్టును అడ్వొకేట్ జనరల్ మరింత సమయం కోరారు. ప్రమాణపత్రం దాఖలుకు గురువారంతో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల సమయం కోరారు ఏజీ.