ETV Bharat / city

Podu land issue in telangana: పోడు భూములపై శాటిలైట్‌ మ్యాప్‌.. ఆ వివరాలు పక్కాగా తేల్చేందుకే! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

తెలంగాణలో పోడు భూముల్లో(Podu land issue in telangana) సాగు ఎప్పటి నుంచి జరుగుతుందో శాస్త్రీయంగా తెలుసుకోవడానికి ఆ రాష్ట్ర అటవీశాఖ.. శాటిలైట్ మ్యాప్​లను తెప్పించింది. వీటిని జిల్లాల వారీగా పంపించనున్నట్లు సమాచారం. పోడు దరఖాస్తుల పరిశీలనకు ఇవి ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.

telangana
telangana
author img

By

Published : Nov 6, 2021, 12:01 PM IST

తెలంగాణలో పోడు భూముల సమస్య పరిష్కారానికి(Podu land issue in telangana) 8వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర అటవీశాఖ సన్నద్ధం అవుతోంది. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం ఎప్పటి నుంచి జరుగుతోందన్న విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించాలని నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్‌లో ఉన్న నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(NRSC News) సాయం తీసుకుంటోంది. అటవీప్రాంతాల పరిస్థితిపై సంవత్సరాల వారీగా శాటిలైట్‌ మ్యాప్‌లను తెప్పించింది. వీటిని జిల్లాల వారీగా డీఎఫ్‌వోలకు పంపించనున్నట్లు సమాచారం. ఈ మ్యాప్‌లు పోడు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియకు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 7,23,629 ఎకరాల్లో అటవీభూమి ఆక్రమణకు గురైనట్లు అటవీశాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తాజాగా మరోసారి అధికారులు అంచనా వేయగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్నిచోట్ల ఇప్పటికీ ఆక్రమణలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సమస్య ఉన్న జిల్లాల్లో తాజాగా అఖిలపక్ష సమావేశాలు కూడా జరిగాయి. నవంబరు 8 నుంచి నెలరోజుల పాటు పోడు(Podu land issue in telangana) సాగుదారుల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు. అటవీహక్కుల గుర్తింపు చట్టం ప్రకారం.. గ్రామ, సబ్‌డివిజన్‌, డివిజన్‌ స్థాయి కమిటీలు వీటిని పరిశీలిస్తాయి. క్షేత్రస్థాయి పరిశీలన కోసం గ్రామస్థాయి కమిటీల్లో అటవీ, గిరిజన, రెవెన్యూ తదితర శాఖలకు చెందినవారుంటారు. అటవీశాఖ తరఫున ఇందులో బీట్‌ అధికారిని నియమిస్తారు. 2,156 గ్రామాల్లో అటవీ ఆక్రమణలు ఉండగా, సమస్య అధికంగా ఉన్న జిల్లాల్లో తగినంతమంది బీట్‌, సెక్షన్‌ అధికారులు లేకపోవడంతో ఇతర జిల్లాలవారిని సర్దుబాటు చేయనున్నారు. సబ్‌డివిజన్‌ కమిటీల్లో ఎఫ్‌ఆర్‌వో, జిల్లా కమిటీల్లో డీఎఫ్‌వో ఉంటారు.

సాంకేతికత ఆధారంగా అర్హులకు న్యాయం..
అటవీశాఖ తెప్పించిన మ్యాప్‌లో 2005 డిసెంబరు నాటికి, 2006లో అటవీప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయనే వివరాలున్నట్లు సమాచారం. ఈ మ్యాప్‌లు, అందులో చిత్రాలను బట్టి పోడు సాగు 2005 డిసెంబరుకు ముందే ఉందా? 2006లోనా, ఆ తర్వాత మొదలైందా? అన్నది పక్కాగా తెలుస్తుందని.. తద్వారా అర్హులకు న్యాయం చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. అటవీహక్కుల చట్టం 2006 ప్రకారం అయితే.. గిరిజనులు 2005కి ముందునుంచి, గిరిజనేతరులు 1930 నుంచి సాగులో ఉన్నట్లు ఆధారాలుండాలి.

ప్రస్తుత లెక్కల ప్రకారం 7.23 లక్షల ఎకరాల అటవీభూమి(Podu land issue in telangana) ఆక్రమణల్లో ఉన్నట్లు ఆ శాఖ చెబుతోంది. ఇందులో రెండు లక్షల ఎకరాల్లో ఆక్రమణలు 2005కి ముందే జరిగాయని.. అందులో గిరిజనుల చేతిలో 50వేల ఎకరాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. పోడుభూముల అంశానికి గిరిజనశాఖ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. అటవీహక్కుల చట్టం 2006 ప్రకారం వీటిని పరిష్కరిస్తారా? 2006 తర్వాతవి కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందా?.. అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:

కుప్పం ఆర్​వోని బాధ్యతల నుంచి తొలగించండి.. హైకోర్టులో తెదేపా పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.