విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించవద్దని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గవర్నర్‌ను కోరారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి, దోపిడీకి శామ్యూల్ సహకరించారనే ఆయనవైపు ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని ఆరోపించారు.
శామ్యూల్ ఐఏఎస్ అధికారిగా పనిచేసినప్పటికీ సీఎం జగన్‌పై దాఖలైన 11 సీబీఐ కేసుల్లో రెండింటిలో సహ నిందితుడిగా విచారణను ఎదుర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలకు అధిపతిగా అవినీతి కేసుల్లో అంటకాగిన వ్యక్తిని నియమించటమేంటి..? రమేశ్‌కుమార్ స్థానంలో గతంలో కనగరాజ్‌ను నియమించిన ప్రభుత్వం... ఇప్పుడు శామ్యూల్ వైపు ఎందుకు ఆసక్తి చూపుతోంది..? ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విశ్రాంత న్యాయమూర్తిని ప్రభుత్వం వాడుకుని వదిలేసిందా? గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించకముందే విజయసాయిరెడ్డి సహా అధికారపార్టీ నేతలంతా శామ్యూల్ తదుపరి ఎస్ఈసీ అని లీకులిస్తున్నారు. తన సహనిందితులందరినీ అందలమెక్కించటం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది.
-వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు
ఇదీ చదవండి: