ETV Bharat / city

cinema tickets: 'చిత్ర పరిశ్రమ హర్షించేలా టికెట్ల ధరలు' - Representatives of the Telugu Film Chamber on cinema tickets

ధరల పెంపుపై  త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు వెల్లడించారు. సినిమా టికెట్ల ధరల పరిశీలనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్‌ ఆధ్వర్యంలోని కమిటీ బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది.

Representatives of the Telugu Film Chamber on cinema tickets

author img

By

Published : Feb 3, 2022, 8:58 AM IST

సినిమా టికెట్ల ధరల పెంపుపై త్వరలోనే ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు తెలిపారు. ప్రజామోదం, చిత్రపరిశ్రమ హర్షించేలా నిర్ణయం ఉంటుందన్నారు. మరో సమావేశం తర్వాత నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. సినిమా టికెట్ల ధరల పరిశీలనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్‌ ఆధ్వర్యంలోని కమిటీ బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. ఫిల్మ్‌ఛాంబర్‌ ప్రతినిధులు వ్యక్తిగతంగా, రాతపూర్వకంగా సమస్యల్ని కమిటీకి నివేదించారు. దాదాపు 3 గంటలపాటు సమావేశం జరిగింది. అనంతరం ఫిల్మ్‌ఛాంబర్‌ ప్రతినిధులు విలేకర్లతో మాట్లాడారు.

సమావేశంలో టికెట్ల ధరల పెంపుపైనే చర్చించాం. ఏ, బీ, సీ సెంటర్లన్నింటిలో ధరలు పెంచాలని కోరాం. ఈ కమిటీ ద్వారా ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు మేలు కలుగుతుందని భావిస్తున్నాం. పరిశ్రమకు, ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనే ఇన్ని సార్లు చర్చిస్తున్నాం. చిరంజీవి, రాంగోపాల్‌ వర్మ ఎవరు చర్చించినా పరిశ్రమ మేలు కోసమే. బెనిఫిట్‌ షోలపై సమావేశంలో చర్చ జరగలేదు. కమిటీ మా సమస్యలపై సానుకూలంగా స్పందించింది. - ముత్యాల రాందాస్‌, తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ ఉపాధ్యక్షుడు

సమస్యల్ని కమిటీకి నివేదించాం. త్వరలో మరో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాం. గతంలో మల్టీఫ్లెక్స్‌ థియేటర్లలో తినుబండారాలు ఎక్కువ ధరకు అమ్మి ఉండవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. - బాలరత్నం, ఎగ్జిబిటర్ల ప్రతినిధి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో నిర్మాతలందరూ సినిమాలు విడుదల చేయాలనుకుంటున్నారు. టికెట్‌ ధరల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరాం. విమర్శలకు తావు లేకుండా కమిటీ చర్యలు తీసుకుంటోంది. అధికారులందరూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు. త్వరలోనే మంచి నిర్ణయం ఉంటుంది. - ఓం ప్రకాశ్‌, సెన్సార్‌ బోర్డు సభ్యుడు

గతంలో కంటే ఇప్పుడు థియేటర్లలో సౌకర్యాలు మెరుగయ్యాయి. అన్నింటినీ ఒకేలా పరిగణించడం సరికాదని కమిటీకి నివేదించాం. ఏసీ, నాన్‌ ఏసీకి అనుగుణంగా టికెట్ల ధరలు ఉండాలని సూచించాం. పంచాయతీ పరిధిలో ఏపీ థియేటర్లు ఉంటే ధరలు పెంచాలని కోరాం. కమిటీ సానుకూలంగా స్పందించింది. - రాంప్రసాద్‌, డిస్టిబ్యూటర్ల ప్రతినిధి

ఇదీ చదవండి: TDP MP KANAKAMEDALA: ఎస్సీ వర్గీకరణపై రాజ్యసభలో ఎంపీ కనకమేడల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.