ETV Bharat / city

'క్వారంటైన్‌కు సిద్ధమైతేనే రాష్ట్రంలోకి అనుమతిస్తాం' - 2020-21 బడ్జెట్ ఆర్డినెన్స్​కు మంత్రివర్గం ఆమోదం

సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. 2020-21 బడ్జెట్ ఆర్డినెన్స్​ను మంత్రివర్గం ఆమోదించింది. లాక్‌డౌన్ పరిస్థితి, కరోనా నివారణ చర్యలపై మంత్రివర్గం చర్చించింది. నిత్యావసర వస్తువుల లభ్యత, అత్యవసర రవాణా పరిస్థితులపై మంత్రివర్గ భేటీలో చర్చించారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

perni nani press meet over cabinet meeting
2020-21 బడ్జెట్ ఆర్డినెన్స్​కు మంత్రివర్గం ఆమోదం
author img

By

Published : Mar 27, 2020, 1:29 PM IST

Updated : Mar 27, 2020, 2:06 PM IST

మంత్రి పేర్ని నాని

2020-21 బడ్జెట్ ఆర్డినెన్స్​ను మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పేర్ని నాని చెప్పారు. వచ్చే 3 నెలల కాలానికి అవసరమైన ఖర్చుల నిమిత్తం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినట్టు వివరించారు. కరోనా వ్యాప్తి చెందకుండా స్వీయనియంత్రణ విధించుకున్నామని మంత్రి పేర్ని నాని వివరించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 28 వేలమంది వచ్చారని పేర్ని నాని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోందని ఉద్ఘాటించారు.

విపక్షాలు విమర్శలు సరికాదు...

క్వారంటైన్‌కు సిద్ధమైతేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్తేనే రాష్ట్రంలోకి అనుమతి ఉంటుందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవారి సంఖ్యపై విపక్షాలు విమర్శలు సరికాదన్న పేర్ని నాని... ఈ నెల 10న సేకరించిన వివరాల ద్వారా 13 వేలమంది అని చెప్పామని వివరించారు. రెండోవిడత సర్వేలో 28 వేలమంది రాష్ట్రంలోకి వచ్చారని తేలిందని చెప్పారు.

ఐసోలేషన్ పడకల ఏర్పాటు...

ప్రతి జిల్లాకేంద్రంలో 200, నియోజకవర్గంలో వంద ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కరోనా బాధితుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్ని నాని వివరించారు. 52 వేల ఎన్‌-95 మాస్కులు అందుబాటులో ఉంచామన్న పేర్ని నాని... 4 వేల పీపీఈలు అందుబాటులో ఉంచామని చెప్పారు. రాష్ట్రంలో 400 వెంటలేటర్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

సామాజిక దూరం పాటించాలి...

అన్నిరకాల సరకు రవాణా వాహనాలను అనుమతిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కలెక్టర్‌ వద్ద రూ.2 కోట్ల అత్యవసర నిధి ఏర్పాటు చేశామన్న పేర్ని నాని... ఆక్వా రంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. మత్స్యరంగం ఎగుమతిదారులతో రేపు అత్యవసర సమావేశం ఉంటుందని వివరించారు. ఉపాధిహామీ, వ్యవసాయ కూలీలు సామాజిక దూరం పాటించాలని కోరారు.

ప్రభుత్వ నిస్సహాయతను అర్థం చేసుకోండి...

కరోనా నియంత్రణకు జిల్లా, నియోజకవర్గాల వారీగా టాస్క్‌ఫోర్సులు ఏర్పాటు చేసినట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తల ద్వారా వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు ప్రభుత్వ నిస్సహాయతను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని కోరారు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సీఎం, సీఎస్‌ మాట్లాడుతున్నారన్న పేర్ని నాని... ఎవరు ఎవరితో తిరిగారో చెప్పలేం కనుక ఈ జాగ్రత్తలు తప్పవని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... గుంటూరు జిల్లా పొందుగుల వద్ద ప్రశాంతం

Last Updated : Mar 27, 2020, 2:06 PM IST

For All Latest Updates

TAGGED:

perni nani
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.