రాజధాని అమరావతిపై జరిగిన.. జరుగుతున్న పరిణామాల గురించి తాను రూపొందించిన చిత్రాన్ని ప్రజల ముందు ఉంచుతున్నానని.. ఇప్పుడున్న పరిస్థితిపై చర్చ జరగాలని రాజకీయ విశ్లేషకులు, ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం, అమరావతి రైతులు, ప్రజలు ఏ మాత్రం ఆలోచించినా తన ప్రయత్నం విజయవంతం అయినట్టేనని చెప్పారు. అమరావతిపై రూపొందించిన డాక్యుమెంటరీని గురువారం విజయవాడలో ప్రదర్శిస్తానన్నారు. అంతర్జాలంలో ఈ ఫిల్మ్‌ని ఉంచుతానని చెప్పారు. ఈ డాక్యుమెంటరీపై అనుకూల, ప్రతికూల వాదనలు, విమర్శలు అన్నింటిని స్వీకరించే వెసులుబాటు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
'రాజధాని విషాదం అమరావతి' డాక్యుమెంటరీ ప్రివ్యూ విశాఖలోని ఓ హోటల్లో జరిగింది. దాదాపు గంట నిడివి ఉన్న దీన్ని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీమంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, వట్టి వసంతకుమార్, మాజీఎంపీలు కంభంపాటి హరిబాబు, ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఆచార్య వైసీ సింహాద్రి, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు సహా పలువురు రాజకీయ, మేధావి వర్గానికి చెందిన ప్రముఖులు తిలకించారు.
ఇదీ చదవండీ... 'దాడి చేసింది ఎవరో తెలియదు.. పేర్లు ఎలా రాయాలి..?'