ఆరడుగుల ఎత్తులో.. బోనగిరి కొండలాంటి మూపురంతో అలరిస్తున్న ఈ వృషభరాజాల ఖరీదు ఎంతో తెలుసా? ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.40 లక్షల పైమాటేనట! గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన రైతు పుంగం సందీపురెడ్డి.. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లో బండలాగుడు పోటీల కోసం వీటిని తీసుకువచ్చారు.
ఇలాంటి పోటీలు ఎక్కడ జరిగినా ఒంగోలు జాతికి చెందిన ఈ కోడెలను తీసుకుని తప్పకుండా హాజరవుతానని, సీనియర్ విభాగంలో తన కోడెలే మొదటి బహుమతి గెలుచుకుంటాయని గర్వంగా చెప్పారు. ఇవి ఇప్పటి వరకు పలు పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయని వివరించారు.
రోజూ వీటికి ఆహారంగా 6 కేజీల ఉలవపిండి, 2 కేజీల రాగిజావ, ఖర్జూరం, గడ్డి, చొప్ప పెడతారు. వీటి పోషణకు రోజుకు రూ. 2,000 వరకు ఖర్చవుతుందని, వీటిని బాగోగులు చూసుకోడానికి ఇద్దరు కూలీలు అవసరమని తెలిపారు.
ఇదీ చదవండి :