తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 42,526 నమూనాలను పరీక్షించగా 2,242 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,53,277కి చేరింది. తాజాగా మరో 19 మంది మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 3125కి పెరిగింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ 4,693 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు పేర్కొంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 343 మందికి పాజిటివ్‌గా తేలింది.