ఎక్సైజ్ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ్‌పై హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పాటించలేదని నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మైక్రో బ్రేవరీ ఏర్పాటుకు పిటిషనర్ ఎక్సైజ్ శాఖ అనుమతి కోరారు. అర్జీపై ఎక్సైజ్ శాఖ స్పందించలేదని పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్ కమిషనర్ విచారణకు రావాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలు పాటించకపోవడంతో హైకోర్టు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు.
ఇదీ చదవండి: మేము చెప్పింది వినకపోతే.. మీ మాటలు వినాల్సిన అవసరం లేదు: హైకోర్టు