గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి చంద్రికకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహాయం అందించారు. సెప్టెంబర్లో కెనడా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు తెదేపా తరపున ఆర్థికసాయం చేశారు. ఎన్ఆర్ఐ తెదేపా, యూకే తెదేపా బృందం సేకరించిన 2 లక్షల 50వేల రూపాయల చెక్ని చంద్రికకు అందజేశారు. దేశం గర్వించే క్రీడాకారిణిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఇతర పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ట్రైనింగ్, ఇతర సహకారం పార్టీ తరపున అందజేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి-ఏపీ సర్వనాశనమే జగన్ స్వప్నం: యనమల