ముఖ్యమంత్రి జగన్ రాసిన స్క్రిప్టునే బోస్టన్ నివేదిక పేరుతో బయటపెట్టారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. శాటిలైట్ సిటీలు, టెక్నాలజీ హబ్‌లను గ్రీన్ సిటీలుగా చూపించారని ఎద్దేవా చేశారు. అవన్నీ విఫలమని చెప్పడాన్నిబట్టే బీసీజీ నివేదిక చిత్తశుద్ధి అర్థమవుతోందని విమర్శించారు. ఏటా 1.3 లక్షల కోట్ల ఆదాయం వచ్చే సైబరాబాద్ గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాజధానికి అమరావతి అనువైందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయం గుర్తుచేశారు. అలాంటి దానిపై వైకాపా ప్రభుత్వం ముంపు ప్రాంతం, అధిక ఖర్చంటూ అసత్య ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. కోర్టులు మొట్టికాయలు వేసినా సీఎం జగన్ వక్రబుద్ధి మారలేదన్నారు.
ఇవీ చదవండి..