ETV Bharat / city

'అమ‌రావ‌తిపై కుట్రలు ఆపండి'

author img

By

Published : Mar 25, 2021, 3:40 PM IST

ప్ర‌జా రాజ‌ధాని అమ‌రావ‌తిపై కుట్రలు ఆపాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. ఎమ్మెల్యే ఆర్కే అసైన్డ్ రైతుల పేరుతో.. సీఐడీకి నకిలీ ఫిర్యాదు ఇచ్చారని ఆరోపంచారు. ఈ విషయాన్ని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టామని చెప్పారు.

nara lokesh comments on ysrcp government in amaravathi issue

  • నిజ‌మేంటో జ‌నానికి తెలిసేస‌రికి, జ‌గ‌న్‌రెడ్డి సృష్టించిన అబ‌ద్ధాలు ప్ర‌పంచం చుట్టి వ‌స్తున్నాయి. అస‌త్య‌ప్ర‌చారమే పెట్టుబ‌డిగా తెచ్చుకున్న‌ అధికారం అండ‌తో అమ‌రావ‌తిపై ప‌న్నిన మ‌రో కుట్ర‌ని తెలుగుదేశం బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. #StingOperationExposesJagan pic.twitter.com/q0TFtYGLUh

    — Lokesh Nara (@naralokesh) March 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమ‌రావ‌తిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప‌న్నిన మ‌రో కుట్రని బట్టబయలు చేశామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అస‌త్య ప్రచారమే పెట్టుబ‌డిగా తెచ్చుకున్న అధికారం అండ‌తో ఈ కుట్ర పన్నారని లోకేశ్​ దుయ్యబట్టారు. ఎమ్మెల్యే ఆర్కే అసైన్డ్ రైతుల పేరుతో.. సీఐడీకి నకిలీ ఫిర్యాదు ఇచ్చారని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టామని ట్వీట్ చేశారు.

ఇప్ప‌టికైనా ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తిపైనా, తెదేపాపైనా కుట్రలు ఆపాలని లోకేశ్​ అన్నారు. అమ‌రావ‌తి విధ్వంసానికి ప్ర‌య‌త్నించిన‌ ప్ర‌తీసారీ న్యాయ‌మే గెలుస్తుందని ఉద్ఘాటించారు. సీఐడీ ఫిర్యాదులో పేర్కొన్న బాధితులకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్​కు జత చేశారు.

ఇదీ చదవండి:

'అమరావతిలో రాజధాని ఇష్టం లేక.. తప్పుడు కేసులు పెట్టారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.