'అన్ని జిల్లాల ప్రజలు ఏకం కావాలి.. అమరావతి కోసం పోరాడాలి' - మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి
రాష్ట్రంలో దుర్భర పరిస్థితుల కారణంగా అమరావతి రైతులు సంక్రాంతి పండుగ కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొందని మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. మందడంలో రైతు దీక్షా శిబిరంలో ఆమె పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. అన్ని జిల్లాల ప్రజలు ఏకమై అమరావతికి మద్దతుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.