రాష్ట్రం పోలీసు రాజ్యంగా మారిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా అరెస్టయి గుంటూరు సబ్ జైలులో ఉన్న ఆయన విడుదలయ్యారు. తన అరెస్ట్‌పై స్పందించిన ఆయన...రాజధాని ఉద్యమాన్ని మరో స్వాతంత్య్ర పోరాటంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఓ ఎంపీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అరెస్ట్‌కు ముందు పోలీసులు కనీసం విధి విధానాలు పాటించలేదన్నారు. నేరస్థులు, ఉగ్రవాదుల మాదిరిగా కనీస సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారా ? అని నిలదీశారు. మూడు రాజధానులు రాష్ట్రానికి గుదిబండన్న జయదేవ్...శాససనభలో ఆమోదిస్తే అయిపోయినట్లు కాదన్నారు. రాజధాని సమస్య పై కేంద్రం స్పందిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి : అందరికీ మంచి జరగాలనే కార్పొరేషన్లు: సీఎం జగన్