ETV Bharat / city

మా పార్టీలోనూ వెన్నుపోటుదారులు ఉన్నారు: అంబటి రాంబాబు - mla ambati rambabu

వైకాపా తరఫున గెలిచి... పార్టీతో పాటు సీఎం జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హెచ్చరించారు. కొందరు నేతలు వైఎస్ఆర్​ను పొగుడుతూనే ఆయన కుమారుడు వైఎస్ జగన్​ను విమర్శిస్తూ సరికొత్త రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

mla  ambati rambabu
mla ambati rambabu
author img

By

Published : Jul 7, 2020, 7:02 PM IST

ఎమ్మెల్యే అంబటి రాంబాబు

అన్ని పార్టీల్లో మాదిరిగానే తమ పార్టీలోనూ వెన్నుపోటుదారులు ఉన్నారంటూ వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై కొందరు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ తరఫున లోక్​సభ సభ్యులుగా గెలిచిన వారు.. వెన్నుపోటుదారుల్లా ప్రవర్తిస్తున్నారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజుని ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి జగన్ సహా ప్రభుత్వాన్ని దూషిస్తున్నారని.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి వారిని పార్టీ నుంచి తీసివేస్తే... బయటపడ్డ చేపలాగా గిలగిలలాడే పరిస్థితి వస్తుందన్నారు. బుధవారం నిర్వహించబోయే వైఎస్​ఆర్ జయంతి వేడుకలను ప్రజలంతా ఘనంగా జరపాలని కోరారు.

ఇదీ చదవండి:

ఏ దరికి చేరునో.. రఘురామరాజకీయం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.