ETV Bharat / city

Minister Suresh On Reforms in Education: సంస్కరణలతో విద్యా వ్యవస్థను పటిష్టం చేశాం: మంత్రి సురేశ్ - reforms in ap education system

minister suresh on reforms in education: పరిపాలన, సంక్షేమం,అభివృద్ధిలో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక ముద్ర వేశారని మంత్రి సురేశ్ అన్నారు. సంస్కరణలతో విద్యావ్యవస్థను సీఎం జగన్ పటిష్టం చేశారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను తెదేపా అడ్డుకుంటోందని విమర్శించారు.

education system in ap
minister suresh
author img

By

Published : Nov 30, 2021, 5:45 PM IST

Minister suresh on reforms in education: సంస్కరణలు అమలు చేయడం ద్వారా విద్యా వ్యవస్థను సీఎం జగన్ పటిష్టపరిచారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్ కింద 11 లక్షల విద్యార్థులకు 650 కోట్ల రూపాయలను జమ చేశామని వెల్లడించారు. కరోనాతో ఆర్థిక పరిస్ధితులు దెబ్బతిన్నా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సీఎం చర్యలు తీసుకున్నారన్నారు.

Minister suresh on NTR University Funds: పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిలో సీఎం జగన్ ప్రత్యేక ముద్ర వేశారని మంత్రి అన్నారు. ప్రతి మంచిపనికీ తెదేపా అడ్డుతగలడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలపై కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిందని, అన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ తన పరిధిలో లేదన్న మంత్రి.. యూనివర్సీటీల్లో ఇబ్బందులు ఉంటే నిధుల జోలికి ప్రభుత్వం వెళ్లదని పేర్కొన్నారు.

Minister suresh slam TDP: రాజకీయంగా అరాచకాలు, దౌర్జన్యాలు చేయడం తెలుగుదేశం పార్టీ సంస్కృతి అని మంత్రి సురేశ్ మండిపడ్డారు. సీఎం జగన్​ను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న విమర్శలు సరికావన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే బదనాం చేయాలని తెదేపా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడైనా నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఉంటే ప్రభుత్వానికి చెప్పాలని సూచించారు.

ఇదీ చదవండి:

Jagananna Vidyadeevena: జగనన్న విద్యా దీవెన మూడో విడత నిధులు విడుదల

Centre on special status for AP: ప్రత్యేక హోదా ముగిసిన అంశం.. పార్లమెంట్​లో కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.