ETV Bharat / city

తమ్ముడి భార్య వరకట్న వేధింపులు.. అన్న ఆత్మహత్య - సెల్ఫీ వీడియో తీసుకొని వ్యక్తి ఆత్మహత్య

Selfie Suicide: తన కుటుంబ పరువు కోసం తమ్ముడి విషయంలో మధ్యవర్తిత్వం వహించడమే ఆ వ్యక్తి చేసిన పాపం. అందుకు ప్రతిఫలంగా సోదరుడి అత్తింటివారి వేధింపులకు గురయ్యాడు. దానికితోడు పోలీసుల వేధింపులు అతనిని తీవ్రంగా కలిచివేశాయి. ఆ బాధను తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

harasment
selfie suicide
author img

By

Published : Sep 23, 2022, 7:13 PM IST

Selfie Suicide: హైదరాబాద్​లో మోతీనగర్‌ సమీపంలోని బబ్బుగూడకు చెందిన వీరస్వామి-పుష్ప దంపతులకు ముగ్గురు కుమారులుండగా.. తండ్రి చనిపోవటంతో ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. రెండో కుమారుడైన హరినాథ్‌కు రెండేళ్ల క్రితం తాండూర్‌కు చెందిన భాగ్యలక్ష్మితో వివాహం జరగగా.. ఇప్పటివరకు వీరికి పిల్లలు పుట్టలేదు. ఈ క్రమంలోనే హరినాథ్‌-భాగ్యలక్ష్మి మధ్య మనస్పర్థలు వచ్చి.. గొడవపడుతుండే వారు. ఆర్నెళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయిన భాగ్యలక్ష్మి.. భర్తతో పాటు ఆయన సోదరుడు ప్రసాద్‌, వీరి కుటుంబంలోని ఏడుగురిపై వరకట్న వేధింపులు, గృహహింస కేసు పెట్టింది. కేసు కోసం తరచూ తాండూరు వెళ్లి వస్తున్న కుటుంబసభ్యులు.. రూ.12 లక్షలు చెల్లించి, రాజీ చేసుకోవాలని ఇరు కుటుంబాలు రాజీ కుదుర్చుకున్నాయి.

ఒప్పందం ప్రకారం విడతల వారీగా డబ్బులు చెల్లిస్తుండగా.. గత నెల చెల్లించాల్సిన రూ.2 లక్షలు ప్రసాద్‌కు సర్దుబాటు కాలేదు. దీంతో భాగ్యలక్ష్మి సోదరుడు హన్మంతు.. పోలీసులతో కలిసి నిత్యం వేధిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రసాద్‌కు ఇంత మొత్తం డబ్బు సర్దుబాటు చేయటం కుదరకపోవటం, మరదలి కుటుంబసభ్యుల ఒత్తిడి భరించలేక.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే తన ఆవేదనను వీడియో రికార్డు చేసి, ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రసాద్‌కు ఓ కుమారుడు ఉండగా.. భార్య గర్భవతిగా ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.