ETV Bharat / city

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కాపాడేందుకు యత్నిస్తారా?: లోకేశ్ - అనంతపురం జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం వార్తలు

వైకాపా ప్రభుత్వ తీరుపై నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లా ఎర్రవంకపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కాపాడే యత్నం చేయటం దారుణమన్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

lokesh on miner rape issue in ananthapur district

author img

By

Published : Dec 18, 2020, 10:15 PM IST

అనంతపురం జిల్లా ఎర్రవంకపల్లిలో మైనర్​పై అత్యాచారానికి పాల్పడిన ఆదినారాయణను వైకాపా నాయకులు కాపాడే యత్నం చేయటం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. బాలికకు న్యాయం చేయాల్సిన నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి నేరస్థుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

  • బాలిక పై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి.అతన్ని కాపాడటానికి ప్రయత్నించిన వైకాపా నేతల పాత్ర పై విచారణ జరిపించాలి(4/4)

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాధితురాలిని, బంధువులను పోలీసు స్టేషన్ ముందు నిలబెట్టి రేపిస్ట్​ని రాజమార్గంలో విడుదల చేయటం ఘోరమని ఆక్షేపించారు. గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మహిళలకు ఏ మాత్రం రక్షణ ఉందో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి

ఓ ప్రేమ కథ... మూడు ప్రాణాలు... ఎన్నో మలుపులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.