పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలని వామపక్ష పార్టీలు డిమాండు చేశాయి. విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు సీపీఎం, సీపీఐతోపాటు 8 వామపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ‘రాష్ట్ర ప్రజలపై రూ.4,300 కోట్ల విద్యుత్తు ఛార్జీల భారం మోపడాన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుపేదల నుంచి భారీ మొత్తాలను వసూలు చేసే ఈ టారిఫ్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. 300 యూనిట్ల లోపు వినియోగించే వారంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినందున వారందరికీ పాత ఛార్జీలనే వర్తింప జేయాలి’ అని డిమాండు చేశాయి.
ఇదీ చదవండి: "పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే.. భారీ ఉద్యమం"