నీటి విడుదల ఉత్తర్వులను గౌరవించాలని.. పొరుగు రాష్ట్రం నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీకి బోర్డు సభ్యకార్యదర్శి లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 9 టీఎంసీల నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేశామని గుర్తు చేసింది.
అయితే.. ఈ నెల 17వ తేదీ వరకు 9.517 టీఎంసీల నీటిని వినియోగించుకున్నారని.. ఇంకా నీటి విడుదల కొనసాగుతోందని బోర్డు లేఖలో లెక్కలతో సహా వివరించింది. ఇకనైనా నీటి విడుదలకు సంబంధించి తాము జారీ చేసిన ఉత్తర్వులను పూర్తి స్థాయిలో పాటించాలని బోర్డు సూచించింది.
ఇవీ చూడండి: