కుటుంబరావుపై 10కోట్ల పరువునష్టం దావా వేసిన కన్నా ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లీగల్ నోటీసులు పంపారు. 10 కోట్ల రూపాయలు పరువునష్టం దావా వేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు డిపాజిట్లు తెచ్చుకుంటే 15లక్షలు ఇస్తానన్న కుటుంబరావు వ్యాఖ్యలు... ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించేలా ఉన్నాయని నోటీసులో వివరించారు. ఇదో రకమైన బెట్టింగ్ అని...ఈ వ్యాఖ్యలు తనతో పాటు పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని కన్నా తెలిపారు.
ఇవీ చూడండి.
కోడెల సవారీనా....అంబటి ఆపరేషనా..?