రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని పేరుతో తమ భూమి కబ్జా చేస్తారనే భయంతో విశాఖ వాసులున్నారని ఆరోపించారు. అమరావతి రైతులకు మద్దతుగా తుళ్లూరు దీక్షా శిబిరానికి కన్నా వెళ్లారు. ఆయనతోపాటు కామినేని శ్రీనివాస్, రావెల కిశోర్ బాబు ఉన్నారు. జగన్ పరిపాలన కక్ష సాధింపుగా కనిపిస్తోందని కన్నా విమర్శించారు. నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అన్ని ఛార్జీలను పెంచి పన్నులు వసూలు చేస్తున్నారన్న కన్నా.. రాష్ట్రంలో ఇసుక మాఫియా కొనసాగుతోందని ఆరోపించారు. ఇప్పటికే పూర్తయిన ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: గుంటూరు జిల్లాలో కారు బోల్తా...ఆరుగురు మృతి