ETV Bharat / city

AP High court: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిలారీ ప్రమాణ స్వీకారం - ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిలారీ ప్రమాణ స్వీకారం చేశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ రవినాథ్ తిలారి.. రాష్ట్రానికి బదిలీపై వచ్చారు.

Justice Ravinath Tilari
జస్టిస్ రవినాథ్ తిలరీ
author img

By

Published : Oct 18, 2021, 3:54 PM IST

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిలారీ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర.. జస్టిస్ తిలారీతో ప్రమాణం చేయించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ రవినాథ్ తిలారిని.. రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు చేసిన సిఫారసుకు ఇటీవల రాష్ట్రపతి ఆమోదముద్ర వేసింది.

జస్టిస్ రవినాథ్ తిలారీ 1969 ఫిబ్రవరి 9న జన్మించారు. 2019 డిసెంబర్ 12న అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఏడాది మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. అలహాబాద్ హైకోర్టు లఖనవూ బెంచ్​లో న్యాయమూర్తిగా సేవలు అందిస్తూ రాష్ట్ర హైకోర్టుకు బదిలీపై వచ్చారు.

ఇదీ చదవండి:

శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.